Share News

తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 07 , 2026 | 08:48 PM

కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ రంగస్థ నటుడు గుమ్మడి గోపాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ: సీఎం చంద్రబాబు

అమరావతి, జులై 07: కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ రంగస్థ నటుడు గుమ్మడి గోపాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును గోపాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రంగస్థల నటనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం సంతోషకరం అని పేర్కొన్నారు.


తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుమ్మడి గోపాలకృష్ణ గుర్తింపు తీసుకొచ్చారని గుర్తు చేశారు. గోపాలకృష్ణ ప్రదర్శించే నాటకాలన్నీ ప్రేక్షకాదరణ పొందుతున్నాయని వివరించారు. తెలుగు రంగస్థల కళకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కడం గర్వకారణం అని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి గుమ్మడి గోపాలకృష్ణ చేసిన సేవలు ప్రశంసనీయం అని అన్నారు. రంగస్థల కళాకారులకు గుమ్మడి గోపాలకృష్ణ అవార్డు ప్రేరణగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం: మంత్రి పొన్నం

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

For More AP News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 08:55 PM