Share News

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:13 AM

'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు దక్కడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది బ్రాహ్మణి నాయకత్వం, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపని పేర్కొన్నారు.

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు
Chandrababu On Nara Brahmani

అమరావతి: 'ఫార్చ్యూన్ ఇండియా' విడుదల చేసిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్' జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు దక్కడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. బ్రాహ్మణి ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో స్థానం సంపాదించడం ఎంతో అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ఇది ఆమె నాయకత్వం, దూరదృష్టి, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపని కొనియాడారు.


బ్రాహ్మణి సాధించిన ఈ ఘనత యువతులకు, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్‌లో కూడా బ్రాహ్మణి మరిన్ని విజయాలు సాధిస్తూ, కొత్త మైలురాళ్లను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తన సందేశంలో తెలిపారు.


Also Read:

‘సర్‌’ రెండు రోజులే కీలకం

'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి

Updated Date - Jul 11 , 2026 | 11:14 AM