Share News

గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Nov 29 , 2026 | 09:49 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు.

గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బయలుదేరుతారు. తొలుత గుంటూరు లక్ష్మీపురంలోని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసానికి చేరుకుంటారు. రాయపాటి భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.


గుంటూరు పర్యటన అనంతరం అనకాపల్లి జిల్లా యలమంచిలికి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. సోమవారం ఉదయం 11.40 గంటలకు యలమంచిలి మున్సిపాలిటీ పరిధి కట్టుపాలెం గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ధర్మవరంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్లను అందజేయడంతో పాటు వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు.


అనంతరం యలమంచిలి పాతవీధిలోని టైల్స్ ఫ్యాక్టరీ ఎదురుగా నిర్వహించే టీడీపీ కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. యలమంచిలి పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు. కాగా, ఈ పర్యటనలో ప్రజావేదిక సభ, పింఛన్ల పంపిణీ, పార్టీ కార్యకర్తల సమావేశం ప్రధాన కార్యక్రమాలుగా ఉండనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!

పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!

Updated Date - Nov 29 , 2026 | 09:53 PM