Share News

పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం.. కోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 08:54 PM

తెలంగాణలోని 'కోడి చెరువు' భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం.. కోర్టు కీలక ఆదేశాలు
AP Dy CM Pawan Kalyan

న్యూఢిల్లీ, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట లభించింది. పవన్ కళ్యాణ్‌పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ చేసిన పోస్టులపై కోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూప్‌లను కోర్టు ఆదేశించింది. ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, మెటా సంస్థలకు అత్యవసర నోటీసులు బెంగళూరు కోర్టు జారీ చేసింది. అనామక అకౌంట్లపై కోర్టు 'జాన్ డో' (John Doe) ఆర్డర్ జారీ చేసింది.


తప్పుడు ప్రచారం చేస్తున్న నిర్దిష్ట యూఆర్‌ఎల్‌లను (URLs) బ్లాక్ చేయాలని ఆయా సంస్థలకు జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు స్పష్టం చేసింది. జూలై 24వ తేదీకి ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. తెలంగాణలోని 'కోడి చెరువు' భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహరంపై బుధవారం బెంగళూరు కోర్టు విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్

వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 09:05 PM