Share News

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు హెల్త్ చెకప్

ABN , Publish Date - May 01 , 2026 | 06:36 PM

ఏపీఎస్ఆర్టీసీలో అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలోని ఉద్యోగులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు హెల్త్ చెకప్
APS RTC MD N Balasubramanyam

అమరావతి, ఏప్రిల్ 01: ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో అన్ని విభాగాల ఉద్యోగులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి ఆరు నెలకు.. ఇతర ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్టీసీలో ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.


ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రతి ఏడాది సుమారు 300 మంది ఉద్యోగులు మరణిస్తున్నారు. ఆర్టీసీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో డ్రైవర్లలో గుండె సంబంధిత వ్యాధి లక్షణాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంస్థలోని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.


దీంతో ఏపీఎస్ఆర్టీసీలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ హెల్త్/లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. పిరియాడికల్ చెకప్‌లో రక్త పరీక్షలు చేర్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ముందస్తు పరీక్షలతో ప్రాణ రక్షణ సాధ్యమని అధికారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో నలుగురి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

For More AP News And Telugu News

Updated Date - May 01 , 2026 | 07:11 PM