Share News

థర్మల్‌ కేంద్రాలు పూర్తిసామర్థ్యంతో పనిచేయాలి: జెన్కో ఎండీ నాగలక్ష్మి

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:48 AM

ఏపీలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందించాలంటే థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కీలకమని జెన్కో ఎండీ నాగలక్ష్మి అన్నారు.

థర్మల్‌ కేంద్రాలు పూర్తిసామర్థ్యంతో   పనిచేయాలి: జెన్కో ఎండీ నాగలక్ష్మి
APGENCO

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందించాలంటే థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కీలకమని జెన్కో ఎండీ నాగలక్ష్మి అన్నారు. బుధవారం వీటీపీఎస్‌ థర్మల్‌ స్టేషన్‌ను ఆమె పరిశీలించారు. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ను పెంచడంతో పాటు ముందస్తు నిర్వహణ చర్యలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ట్రిప్పింగ్‌లు, సాంకేతిక లోపాలు, బ్రేక్‌ డౌన్‌లు తగ్గించేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఎల్‌నినో కారణంగా విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కనీసం 10 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

Updated Date - Jul 30 , 2026 | 07:48 AM