ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. రూ.50 వేల వడ్డీ లేని రుణం
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:28 PM
ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎఫ్‌సీవీ(FCV) పొగాకు రైతులకు ప్రతి బార్న్‌కు రూ.50వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎఫ్‌సీవీ(FCV) పొగాకు రైతులకు ప్రతి బార్న్‌కు రూ.50వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి పొగాకు రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వివరించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారం నుంచి ఉపశమనం కలుగుతుందనే చర్చ పొగాకు రైతుల్లో జరుగుతోంది.
ఎఫ్‌సీవీ పొగాకు రైతులు పంట సాగు, క్యూరింగ్ ప్రక్రియ, బార్న్ నిర్వహణకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టా్ల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. దీంతో రైతులపై అప్పుల భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ లేని రుణం అందుబాటులోకి వస్తే రైతులకు తక్షణ నగదు అవసరాలు తీర్చుకునే అవకాశం లభిస్తుందని కేంద్రం భావించింది.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని ఆలోచించింది. అదీకాక ఈ ఏడాది జులైలో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎఫ్‌సీవీ పొగాకు మార్కెట్ పరిస్థితిని ఈ బృందం సమీక్షించింది. ఈ నేపథ్యంలో ఏపీలోని పొగాకు రైతుల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆత్మకూరు కేజీబీవీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
Read Latest AP News And Telugu News