Share News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్న మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:35 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో అమరావతి రైతులు, ఏపీ ప్రజల కల నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్న మంత్రి లోకేశ్..
AP Minister nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో అమరావతి రైతులు, ఏపీ ప్రజల కల నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవనున్నారు. సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై ఏపీ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్ లెట్‌ను అందజేయనున్నారు.


ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్ సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్నీ పార్టీలు మద్దతు తెలిపాయి. మరుసటి రోజున రాజ్యసభకు బిల్లు వెళ్లగా అక్కడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఏప్రిల్ 6న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని పరిశీలించి ఆమోదించారు. అదే రోజు రాత్రి 10 గంటల కల్లా గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం వెలువడింది. ఏపీ పునర్వవస్థీకరణ చట్టం సబ్ సెక్షన్-2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రస్థాయిలో చట్టబద్ధ రక్షణ లభించింది.


ఈ వార్తలు కూడా చదవండి

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

నెల్లూరులో ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీ నేతలపై కేసులు

Updated Date - Apr 11 , 2026 | 03:45 PM