Share News

ఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణ.. హాజరైన మంత్రి లోకేశ్

ABN , Publish Date - May 26 , 2026 | 02:18 PM

ఢిల్లీలో జరిగిన ‘అప్నాపన్ మై ఎక్స్‌పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ఈ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తనకు ఉన్న అనుబంధం, అనుభవాల ఆధారంగా రూపొందించారు.

ఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణ.. హాజరైన మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

ఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన ‘అప్నాపన్ మై ఎక్స్‌పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) రచించిన ఈ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) తనకు ఉన్న అనుబంధం, అనుభవాల ఆధారంగా రూపొందించారు.


భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఆవరణలో ఈరోజు (మంగళవారం) ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ‘అప్నాపన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నాయకులు, పలువురు సాహితీ ప్రముకులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులతో సమావేశమై శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వం, వ్యక్తిత్వం, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధంపై శివరాజ్ సింగ్ చౌహాన్ తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరించినట్లు కార్యక్రమంలో ప్రసంగించిన నేతలు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు

గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 03:16 PM