రైతుల కష్టాలను రాజకీయం చేయకు జగన్: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:58 PM
రైతుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి, మార్చి 11: రైతుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల కష్టాలపై రాజకీయాలు చేయవద్దంటూ జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. బుధవార అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతుల కోసం పని చేయని వారు ఇప్పుడు విమర్శలా? జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లు రైతులు గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు ఈ నాటకం ఎందుకు? అంటూ వైసీపీ అధినేతను మంత్రి అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. రైతన్నల పేరుతో రాజకీయ డ్రామాలు ఇక సాగవంటూ మాజీ సీఎం జగన్‌కు సూచించారు. రైతుల్ని మోసం చేసిన చరిత్ర మీదంటూ వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జగన్ ఆర్థిక ఉగ్రవాదానికి రాష్ట్రం బలి: మంత్రి సత్యకుమార్
ప్రజాహితం కోరే వారయితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. పలు సంక్షేమ పథకాల కింద మీరు ఎగ్గొట్టిన చెల్లింపుల సంగతేమిటని జగన్‌ను ఈ సందర్భంగా నిలదీశారు. అమరావతిలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబును విమర్శించేంత సీన్ లేదని తెలుసుకోండంటూ జగన్‌కు సూచించారు. ప్రజారోగ్య రంగాన్ని మీరు చెరబెట్టింది వాస్తవం కాదా? అని అడిగారు.
ఎన్టీఆర్ వైద్య సేవ, మందుల కొనుగోలు, పలు నిర్మాణ కార్యక్రమాలకు ఎందుకు బకాయిలు పెట్టారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఆర్థిక ఉగ్రవాదానికి రాష్ట్రం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఈ సందర్భంగా జగన్‌రెడ్డిని మంత్రి సత్యకుమార్ యాదవ్ నిలదీశారు. మీరు ఘనులైతే ప్రజలు మీకు ఎందుకు రెండు పంగనామాలు పెట్టారంటూ వ్యంగ్యంగా వైసీపీ అధినేత జగన్‌ను ప్రశ్నించారు.
ఆ పాపం మిమ్మల్ని వదలదు: ధూళిపాళ్ల నరేంద్ర
కల్తీ నెయ్యి పాపం మిమ్మల్ని వదలదని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే సంగం డైయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు. ఆ బురద తమకు అంటించే ప్రయత్నం మానాలంటూ వారికి హితవు పలికారు. కలియుగ దైవం అంశంలో తప్పు చేసినోళ్ళు మట్టిలో కలవడమేనని స్పష్టం చేశారు. హెరిటేజ్, సంగం డెయిరీలవి దశాబ్ధాల ప్రస్థానమని గుర్తు చేశారు. వాటి మీద దుష్ప్రచారం చేస్తే.. ఆకాశం మీద ఉమ్మినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఒకే అబద్ధాన్ని అందరూ అన్ని వైపులా ప్రచారం చేయటంలో వైసీపీ వాళ్లు నిష్ణాతులున్నారు. అందుకే వైసీపీ బ్యాండ్ ఆఫ్ సైకోస్ టీమ్ అని అభివర్ణించారు. ఆ పార్టీలో ఒకరు, ఆ తర్వాత మరోకరు.. ఇలా ఐదుగురి తర్వాత అడిగిన ప్రశ్నే ఆరోసారి వైఎస్ జగన్ వచ్చి మళ్లీ అడుగుతాడన్నారు.
33 రోజులు తనను జైల్లో ఉంచి 200 మంది పోలీసులతో 30 రోజుల పాటు సంగం డెయిరీ మొత్తం జల్లెడ పట్టారని గుర్తు చేశారు. వైష్ణవి డెయిరీ అనుబంధం నాడు కనబడలేదా? అంటూ వైసీపీ అధినేతను ప్రశ్నించారు. వైష్ణవితో అనుబంధం ఏమిటో.. తన మీద కుట్రలు చేసి వైసీపీకి సహకరించిన సంగం డెయిరీ మాజీ చైర్మన్‌ను అడగాలంటూ జగన్‌కు ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
For More AP News And Telugu News