రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:28 PM
రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అగ్ని ప్రమాదం.. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరపాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
అమరావతి, మార్చి 11: రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అగ్ని ప్రమాదం.. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరపాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సమీప పోలంలో నుంచి మంటలు వచ్చాయని ఎల్ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు. పోలం నుంచి పైపుల వరకు గడ్డి పేర్చి.. పైపులకు నిప్పు పెట్టినట్లు అనవాళ్లు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రమాద ఘటన స్థలానికి ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే చేరుకుంది.
మరో వైపు పోలాల వైపు నుంచి మంటలు అంటుకుంటూ వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంపై పలు సందేహాలను స్థానికులు వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయని ఫైర్ డీజీ వెంకట రమణ వెల్లడించారు. అగ్నికి ఆహుతి అయిన పైప్ లైన్లు అన్ని ఏడు రకాల ఎమినిటీస్ కల్పించేందుకు ఉంచినవని అధికారులు వెల్లడించారు. ఇవన్నీ పీవీసీ పైపులని.. చాలా ఖరీదైనవని అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ
For More AP News And Telugu News