Share News

విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి సహాయం: సీఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 07:40 PM

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది.

విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి సహాయం: సీఎం కీలక ఆదేశాలు

అమరావతి, మార్చి 02: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. అందుకు సంబంధించి ఎన్‌ఆర్‌టీ(NRT), ఆర్టీజీఎస్‌(RTGS)కు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని.. పౌరులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని సహాయం అందించడంతోపాటు సురక్షితగా వెనక్కి తీసుకు వచ్చేందుకు భారత విదేశాంగ శాఖ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలాగే తెలుగు వారిని ఆయా రాష్ట్రాలకు తీసుకు వచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. అందుకోసం హెల్ప్ లైన్ నెంబర్లతోపాటు వాట్సప్, ఈ మెయిల్‌ ద్వారా తమను సంప్రదించాలంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వాటిని విడుదల చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి

చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?

For More AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 07:52 PM