అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Mar 12 , 2026 | 09:52 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్ధాన్ని మళ్లీ ప్రెస్‌మీట్‌లో చెప్పారని.. అబ్బద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు.
అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్ధాన్ని మళ్లీ ప్రెస్‌మీట్‌లో చెప్పారని.. అబ్బద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు. బాబాయి హత్య కేసులో ‘నారాసుర రక్త చరిత్ర’ అని మా నాయకులు సీఎం చంద్రబాబు పై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. సొంత చెల్లిని కూడా నిందితురాలిని చేయాలని చూశారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసింది. ఇప్పటికైనా ‘కాగ్’ రిపోర్ట్‌ను జగన్ మోహన్ రెడ్డి చదువుకోవడం మంచిదని మంత్రి అన్నారు.
పయ్యావుల మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది. రూ.3.5లక్షల కోట్లు అప్పు చేశామని జగన్ అబద్ధం చెబుతున్నారు. అప్పులు ఇవ్వొద్దని వందకుపైగా సంస్థలకు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జగన్ ప్రవర్తిస్తున్నారు. మీలా బుకాయింపు రాజకీయాలు మేము చేయలేదు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైకాపా ఎంపీ గురుమూర్తి కోర్టుకెక్కి తిట్లు తిన్నారు. వారసత్వంగా వచ్చిన అప్పులు 9లక్షల కోట్ల పైమాటే, సొంత పేపర్‌లో ఓ స్టేట్మెంట్ ఇప్పించి అవే తీసుకువచ్చి బొత్స సత్యనారాయణతో మండలిలో చెప్పించారు. రూ. 21వేల 600 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోయిందని జగన్ చెప్పారు. నాడు రెండు నెలలు పద్దులు మీ వద్దే ఉన్నాయి.. రెండు నెలల్లోనే 60వేల కోట్లలో 30వేల కోట్లు డెఫిసిట్ చూపిన ఘనత మీదని విమర్శించారు. నెట్ బారోయింగ్‌ను కూటమి ప్రభుత్వం ఎక్కడ అధిగమించలేదన్నారు. జగన్ మూడు గంటల ప్రెస్ మీట్ బదులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేదని’ పయ్యావుల కేశవ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్ రికార్డ్
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు