Share News

గోదావరి పుష్కరాలకు.. 30 వేల మంది వైద్య సిబ్బంది

ABN , Publish Date - Aug 24 , 2026 | 08:01 PM

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

గోదావరి పుష్కరాలకు.. 30 వేల మంది వైద్య సిబ్బంది

అమరావతి, ఆగస్టు 24: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్రంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తనున్నారు. దీంతో వారికి భారీ స్థాయిలో వైద్య సేవల అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై సోమవారం రాజధాని అమరావతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


మొత్తం 525 పుష్కర ఘాట్లలో 1,110 వైద్య శిబిరాలతోపాటు 30 ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం 30,000 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించనున్నారు. అదే విధంగా అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్‌‌ను ఏర్పాటు చేస్తారు. 2027, ఏప్రిల్ 30 నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంగా మంత్రి నిర్దేశించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్

పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 08:41 PM