Share News

ఏపీ వైద్యారోగ్యశాఖలో నాలుగు కీలక విభాగాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:52 PM

ఏపీ వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు కీలక శాఖలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు వారికి బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీ వైద్యారోగ్యశాఖలో నాలుగు కీలక విభాగాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు ముఖ్య విభాగాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మెడికల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా సౌరభ్‌ గౌరవ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే.. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌గా వీరపాండియన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.


ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ సీఈఓగా కేవీఎన్‌.చక్రధర్‌ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక.. ఆయుష్‌ విభాగం డైరెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అంతకముందు.. ఆయుష్‌ డైరెక్టర్, ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ సీఈవో బాధ్యతలు చూస్తున్న దినేశ్ కుమార్‌ను ప్రభుత్వం ఇటీవల పోలవరం కలెక్టర్‌గా బదిలీ చేయడంతో ఈ విభాగం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్న సౌరభ్‌ గౌరవ్‌ను సైతం తమిళనాడు ఎన్నికల విధులకు వేశారు. అయితే.. కీలక శాఖ పరిస్థితి వివరించడంతో ఆయనకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిచ్చారు.


ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 24 , 2026 | 09:52 PM