జేఎస్‌సీ సమావేశాలపై క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - May 22 , 2026 | 01:43 PM
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 2026-27 సంవత్సరానికి జేఎస్‌సీ సమావేశాల షెడ్యూల్‌ను వివరించింది.
అమరావతి, మే22: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 2026-27 సంవత్సరానికి జేఎస్‌సీ సమావేశాల షెడ్యూల్‌ను వివరించింది. అందుకు సంబంధించిన జీవో ఆర్‌టీ నంబర్ 1032ను సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం రాజధాని అమరావతిలో విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో జిల్లా స్థాయి జేఎస్‌సీ సమావేశాలు ఉంటాయని తెలిపింది.
అలాగే జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో హెచ్‌వోడీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా జులై, నవంబర్, మార్చిలో సచివాలయంలోని వివిధ శాఖల జేఎస్‌సీ సమావేశాలు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి వేదికగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశాల మినిట్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లతోపాటు వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌వోడీ)లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు.. కేసు నమోదు
అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు
For AP News And Telugu News