Share News

ఇంధన సరఫరాలో ప్రజలకు వాస్తవాలు చెప్పండి: మంత్రి నాదెండ్ల

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:39 PM

రాష్ట్రంలో ఇంధన కొరత లేదని ఈ విషయాన్ని గమనించాలని వాహనదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

ఇంధన సరఫరాలో ప్రజలకు వాస్తవాలు చెప్పండి: మంత్రి నాదెండ్ల
AP Minister Nadendla Manohar

అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని ఈ విషయాన్ని గమనించాలని వాహనదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన అమ్మకాలతో ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఆ కారణంతోనే డీజిల్, పెట్రోల్ కొరత అంటూ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు.


రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఆదివారం అమరావతిలో ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరా వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా పని చేయాలని ఆదేశించారు.


ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రైతులతోపాటు అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని వారిని కోరారు. పోలీస్ శాఖతో సమన్వయం అవసరమని ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం

కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి

For More TG News And Telugu News

Updated Date - Apr 26 , 2026 | 05:06 PM