కడప బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు: మంత్రి కొల్లు
ABN , Publish Date - Aug 24 , 2026 | 08:32 PM
కడప బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
అమరావతి, ఆగస్టు24: కడప బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. CSIR-NGRIతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం చేసుకుందన్నారు. క్రిటికల్ మినరల్స్ వెలికితీత ఒప్పందం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా భవిష్యత్తు పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగాలకు అత్యంత అవసరమైన లిథియం, గాలియం వంటి క్రిటికల్ మినరల్స్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం CSIR-NGRI మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఆగస్టు 12వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, ఎన్జీఆర్ఐ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, భూగర్భ నిర్మాణాలపై ఆధునిక జియోఫిజికల్ సాంకేతికత వినియోగం ఈ ఒప్పందంలో ప్రధానంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్
పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే
Read Latest AP News And Telugu News