ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ABN , Publish Date - May 27 , 2026 | 09:37 PM
ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, మే 27: ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఎమన్నారంటే.. ‘ త్యాగం, ప్రేమ, సోదరభావ సందేశాన్ని చాటే ఈ పవిత్ర బక్రీదు పర్వదినం మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో బక్రీదు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
అల్లాహ్ ఆజ్ఞ మేరకు ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధమైన సంఘటనను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకోవడం ఆచారం. చివరికి అల్లాహ్ వారి భక్తిని పరీక్షించి ఆశీర్వదించాడనే విశ్వాసం ఉంది.త్యాగ గుణాన్ని ప్రపంచానికి తెలియచెప్పిన ఈ విశిష్ట దినం నాడు అల్లాహ్ కరుణ మీ పైనా, మీ కుటుంబం పైనా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News