ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పావలా వడ్దీకే రుణాలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 08 , 2026 | 03:10 PM
దేశ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులకు పావలా వడ్డీకే విద్య రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు.
అమరావతి, మే 08: దేశ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులకు పావలా వడ్డీకే విద్య రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలతోపాటు తల్లికి వందనం, సంక్షేమంపై అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. అలాగే పథకాల అమలు, లబ్దిదారుల ఇంటిగ్రేషన్‌పై వారికి సీఎం దిశానిర్దేశం చేశారు.
అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీ శక్తి, దివ్యాంగశక్తి పథకాలపై చర్చించారు. దీపం-2.0 పథకం కింద 1.08 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని తెలిపారు. దీపం-2.0 పథకానికి ఇప్పటి వరకు రూ.3,504 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. స్త్రీ శక్తి కోసం ఏడాదికి రూ.1,940 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. తల్లికి వందనం కింద 67 లక్షల మందికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
ఏజెన్సీల్లో కాఫీ, పసుపు, కుంకుమపువ్వు సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ప్రకటించారు. అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండ్ తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ల సమావేశం గురువారం రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం ఈ రోజు సాయంత్రం ముగియనుంది.
ఇవి కూడా చదవండి..
కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు: మంత్రి సత్యకుమార్
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News