Share News

పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం: మంత్రి ఆనం

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:55 PM

పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం అయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..

పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం: మంత్రి ఆనం
Amaravati capital news

ఆత్మకూరు, ఏప్రిల్2: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోందని, తెలుగు ప్రజల ఏళ్ల నాటి కల, ఆశయం నెరవేరబోతున్నాయని మంత్రి ఆనం పేర్కొన్నారు. అంతేకాదు, ఐదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూనే, రాష్ట్ర భవిష్యత్తుపై, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.


మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రజల దశాబ్దాల ఆశ, ఆకాంక్షలు నెరవేరే చరిత్రాత్మక రోజు ఇది. భారత పార్లమెంట్ వేదికగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అధికారికంగా ఆమోదం పొందనుంది. గత ఐదేళ్ల కాలంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని విషయంలో ‘మూడు ముక్కలాట’ ఆడి ప్రజలను వంచించారు. జగన్ హయాంలో జరిగిన దుర్మార్గాల నుంచి, అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బలి కాకుండా కూటమి ప్రభుత్వం రక్షించింది’ అని అన్నారు.


అందరికీ అందుబాటులో అమరావతి..

రాజ్యసభ మాజీ సభ్యులు, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య అమరావతికి మద్దతు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన దూరంలో, అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు కేంద్రం. గతంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు నాయుడు, అదే తరహాలో అమరావతిని కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం నాకుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

హైదరాబాద్‌లో విషాదం.. ఆడిషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:01 PM