Share News

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:47 AM

ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు సీజే లిసాగిల్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ.ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌..

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు

  • ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ లిసాగిల్‌

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు సీజే లిసాగిల్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ.ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావులను శాశ్వత న్యాయమూర్తులగా ప్రమాణం చేయించారు. అంతకు ముందు శాశ్వత న్యాయమూర్తులుగా వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ జి.గోపి చదివి వినిపించారు. సోమవారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ టి.నిరంజన్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు ద్వారకానాథ్‌ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ప్రభునాథ్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ జి.గోపి హాజరయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 04:50 AM