Share News

విచారణకు రండి.. అంబటికి ఈడీ పిలుపు

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:49 AM

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం రవాణా కుంభకోణం కేసులో విచారణకు హజరుకావాలని వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

విచారణకు రండి.. అంబటికి ఈడీ పిలుపు

  • లిక్కర్‌ స్కామ్‌లో ఈరోజు హాజరు కావాలని నోటీసులు

  • కారుమూరికి బెయిల్‌ తిరస్కరణ

హైదరాబాద్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం రవాణా కుంభకోణం కేసులో విచారణకు హజరుకావాలని వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. బుధవారం హైదరాబాద్‌ని ఈడీ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని నోటీసుల్లో పేర్కోన్నారు. వాస్తవానికి గతంలో రెండు సార్లు ఈడీ అధికారులు అంబటికి నోటీసులు జారీ చేసినా.. అనారోగ్య సమస్యల వల్ల తాను విచారణకు హజరుకాలేనని బదులిచ్చారు. అంబటి పంపించిన వైద్య నివేదికలు, ఆపరేషన్‌ వివరాలను పరిశీలించిన తర్వాత తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఇదే కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. వీరిద్దరు బెయిల్‌ కోసం వేసిన పిటిషన్లు కోర్టు కొట్టివేయడం ఇది రెండోసారి.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 05:50 AM