Share News

కోనసీమ జిల్లా ముమ్మిడివరం వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు, కారు..

ABN , Publish Date - May 23 , 2026 | 05:26 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ జాతీయ రహదారి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

కోనసీమ జిల్లా ముమ్మిడివరం వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు, కారు..
Road Accident

అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ జాతీయ రహదారి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాజోలు నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సు వెళ్తోంది. కాకినాడ నుంచి మామిడికుదురుకు కారు ప్రయాణిస్తోంది. రెండు వాహనాలు అనాతవరం దగ్గరికి రాగానే ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.


అలాగే ముమ్మిడివరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్సపొందుతూ బాధితుల్లో ఓ మహిళ మృతిచెందింది. ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్ కుమార్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆస్తి కోసం తల్లి, చెల్లిని తరిమేశాడు.. జగన్ వ్యక్తిత్వం అది: మంత్రి అనగాని సత్యప్రసాద్

చోరీలపై ఉక్కుపాదం: 51 కేసులు ఛేదించి, 60 మంది అరెస్ట్!

Updated Date - May 23 , 2026 | 05:54 PM