Share News

సెప్టెంబర్ 2న ఘనంగా జనసేన యువజన విభాగం ఆవిష్కరణ..

ABN , Publish Date - Aug 30 , 2026 | 07:13 PM

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. పిఠాపురంలో జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు.

సెప్టెంబర్ 2న ఘనంగా జనసేన యువజన విభాగం ఆవిష్కరణ..
JanaSena Youth Wing

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. పిఠాపురంలో జనసేన యువజన విభాగాన్ని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యతో కేరళలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమానికి హాజరుకానున్నారు.


సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు యువజన విభాగాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు. అనంతరం విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. యువజన విభాగం లోగో, గీతాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు.


కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జనసేన ప్రణాళికలు రచించింది. అలాగే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

Updated Date - Aug 30 , 2026 | 07:48 PM