Share News

కోనసీమలో కేంద్ర బృందం పర్యటన.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై ఆరా

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:53 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఈ బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది.

కోనసీమలో కేంద్ర బృందం పర్యటన.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై ఆరా
Central Assessment Team

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్టోబర్ 31: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఈ బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది. రావులపాలెం సీఆర్‌సీలో తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యుత్ నష్టం, రహదారులు, ఆస్తి నష్టాలను వివరించారు.


తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని తెలియజేసేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని కేంద్ర బృందం సందర్శించింది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన, గల్లంతైన మత్స్యకారుల పడవలు, దెబ్బతిన్న వలలకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకుంది. ఈ బృందంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అడిషనల్ డెరైక్టర్ ప్రశాంత్ అర్మోరికర్, ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్ గార్గ్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ ప్రఖర్ జైన్, విపత్తు నిర్వహణ రెవెన్యూ విభాగానికి చెందిన అధికారులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

రాప్తాడు ఘటన.. విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

‘ఎలాంటి సాయానికైనా సిద్ధం’.. ఏపీ మంత్రికి తెలంగాణ డిప్యూటీ సీఎం ఫోన్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 04:21 PM