Share News

పాప మిస్సింగ్‌పై అసత్య ప్రచారాలు మానండి.. లేదంటే చర్యలు తప్పవు: అనిత వార్నింగ్

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:22 PM

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమని హోం మంత్రి అన్నారు.

పాప మిస్సింగ్‌పై అసత్య ప్రచారాలు మానండి.. లేదంటే చర్యలు తప్పవు: అనిత వార్నింగ్
Home Minister Anitha

కాకినాడ, జూన్ 17: తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమన్నారు. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న జ్ఞానేశ్వరి తల్లి బాధ వర్ణణాతీతమని అన్నారు. పాప మిస్సయిన విషయం తెలుసుకొన్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. టెక్నికల్‌కు సంబంధించిన ఆధారాలే కాకుండా గ్రౌండ్ లె‌వెల్‌లో వివిధ బృందాలు జల్లెడ పడుతున్నాయని చెప్పారు.


పాప మిస్సింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం వహించలేదని హోం మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు ఈ అంశం మీద మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పాప ఆచూకీ దొరికే వరకూ గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా భరోసాగా ఉంటుందని అన్నారు. సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. తక్షణమే అలాంటి అసత్య ప్రచారాలను నిలిపివేయాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిత్వ హననానికి దిగజారారు: గొట్టిపాటి రవికుమార్

గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 05:47 PM