Share News

గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:43 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌కు మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్‌నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
AP Women Commission

అమరావతి, జూన్ 17: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌కు మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్‌నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన మహిళా నేతలు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హోం మంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో విమర్శలు, విధానాలు, నిర్ణయాలకే పరిమితం కావాలని.. మహిళల వ్యక్తిత్వం, రూపురేఖలు, వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుడు సందేశాలను పంపుతుందని మహిళా నేతలు తెలిపారు.


సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పేలా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను మహిళలు కోరారు. దీనిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందిస్తూ.. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అందిన ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని శైలజ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

‘మీ ఇంటి వద్దే ఉన్నా.. డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు లోకేశ్ సవాల్

అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిత్వ హననానికి దిగజారారు: గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 05:09 PM