గణేశా.. నీకోసమే గంగమ్మ!
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:18 AM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక వాగులు వంకలు, చెరువులు చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. బోర్లలో కూడా నీటి మట్టం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో వినాయక నిమజ్జనం ఎలా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
నిమజ్జనం కోసం ట్యాంకర్లతో నీరు
కంచిపల్లి చెరువును నింపుతున్న గ్రామస్థులు
గిద్దలూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక వాగులు వంకలు, చెరువులు చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. బోర్లలో కూడా నీటి మట్టం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో వినాయక నిమజ్జనం ఎలా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దీంతో గిద్దలూరు మండలంలో నిమజ్ఞనం కోసం ఎండిన చెరువును నీటితో నింపుతున్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచనలతో.. మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలను కంచిపల్లి చెరువులో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. దీంతో కంచిపల్లి మాజీ సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి, గ్రామస్థులు పెద్దఎత్తున ట్యాంకర్ల ద్వారా చెరువులో నీటిని నింపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను కంచిపల్లి చెరువులో నిమజ్జనం చేసుకోవచ్చని, భక్తులకు తాగునీటి సదుపాయంతోపాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’