Share News

కడుపులో కల‘కలం’

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:34 AM

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన మహిళ(33) పొట్ట నుంచి 13 పెన్నులు, 5 చెక్కస్పూన్లు, ఒక మైనపు ఒత్తిని వైద్యులు వెలికి తీశారు.

కడుపులో కల‘కలం’

  • ఎండోస్కోపీతో బయటకు తీసిన వైద్యులు

నరసరావుపేట లీగల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన మహిళ(33) పొట్ట నుంచి 13 పెన్నులు, 5 చెక్కస్పూన్లు, ఒక మైనపు ఒత్తిని వైద్యులు వెలికి తీశారు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సదరు మహిళ.. స్థానిక మాతాశ్రీ వైద్యశాలలో చేరారు. పలు రకాల పరీక్షలుచేసిన అనంతరం ఆమె కడుపులో పెన్నులు, చెంచాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా ఎండోస్కోపీ ద్వారా వాటిని బయటకు తీశామని డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. గతంలో కూడా ఆమె నాలుగు పెన్నులను మింగిందని, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమె అలా చేసిందని వివరించారు.

ఈ వార్తలను కూడా చదవండి

ధారకొండ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్‌

Updated Date - Sep 07 , 2026 | 04:34 AM