Share News

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:37 PM

నగరంలోని దమ్మలవీధిలో నూతనంగా నిర్మించిన నాగవల్లి బాస్కెట్‌బాల్‌ కోర్టును ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆదివారం ప్రారంభిం చారు.

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్‌
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌/స్పోర్ట్స్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నగరంలోని దమ్మలవీధిలో నూతనంగా నిర్మించిన నాగవల్లి బాస్కెట్‌బాల్‌ కోర్టును ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆదివారం ప్రారంభిం చారు. సీమెన్‌ మైలపిల్లి మురళి తన సొంత నిధులను వెచ్చించి బాస్కెట్‌బాల్‌ కోర్టు నిర్మించ డంతో ఎమ్మెల్యే అభినందించారు. క్రీడాకారులతో కలిసి బాస్కెట్‌బాల్‌ ఆడి వారిలో ఉత్సాహం నిం పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నియోజక వర్గంలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక క్రీడాకా రులు, యువత పాల్గొన్నారు.

సంక్షేమ భవనానికి భూమిపూజ

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సింగుపురంలో సైనిక వెల్ఫేర్‌ పంచాయతీ సేవా సంఘం నూతన కమ్యూనిటీ హాల్‌ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ శంకుస్థాపన చేశారు. సింగుపురం గ్రామ మాజీ, ప్రస్తుత సైనికుల సంక్షేమ సంఘానికి కమ్యూనిటీ హాల్‌ నిమిత్తం గతంలో ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. కార్య క్రమంలో సైనిక వెల్ఫేర్‌ పంచాయతీ సేవా సంఘం ప్రెసిడెంట్‌ బి.నరసింగరావు, సింగుపురం గ్రామ పెద్దలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:37 PM