గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె!
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:02 AM
జిల్లాలోని పొన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రియుడితో కలిసి తల్లిని కుమార్తే హతమార్చిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు, సెప్టెంబర్ 12: జిల్లాలోని పొన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రియుడితో కలిసి తల్లిని కుమార్తే హతమార్చిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి(45)తన కుమార్తె పుష్పలతో కలిసి 8వ వార్డులో నివాసముంటున్నారు. లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో పలు అనుమానాలు రేకేత్తుతున్నాయి. తల్లి అనారోగ్యంతో మృతి చెందారని కుమార్తె తెలుపగా.. ఆరోగ్యంగా ఉండే లక్ష్మి అకస్మాత్తుగా మరణించడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కుమార్తె తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందని బంధువులు ఆరోపిస్తు్న్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమార్తె, బంధువులను విచారిస్తున్నారు. అలాగే మృతురాలి కుమార్తె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలను విభిన్న కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టంనివేదిక అనంతరం హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘సూపర్ సిక్స్’తో ఆర్థిక భద్రత
హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు
Read Latest AP News And Telangana News