వేట ఎలా సాగుతోంది?
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:50 AM
గోదావరి వేట ఎలా సాగుతోంది? రోజుకు ఎంత సంపాదిస్తున్నా రు? మార్కెటింగ్ ఎలా ఉందంటూ సీఎం చంద్రబాబు వేట సాగించే మత్స్యకారులతో చిట్‌చాట్ చేశారు.
మత్స్యకారులతో సీఎం చిట్‌చాట్
నరసాపురం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గోదావరి వేట ఎలా సాగుతోంది? రోజుకు ఎంత సంపాదిస్తున్నా రు? మార్కెటింగ్ ఎలా ఉందంటూ సీఎం చంద్రబాబు వేట సాగించే మత్స్యకారులతో చిట్‌చాట్ చేశారు. నరసాపురంలోని పొన్నపల్లికి చెందిన మత్స్యకారులు దుర్గారావు, సత్యనారాయణ, ఏడుకొండలు, స్వామికి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం బుడితలవారి రేవు గట్టుపై కూర్చొని వారితో ముచ్చటించారు. గోదావరిలో పెరుగుతున్న కాలుష్యంపై సీఎంకు దుర్గారావు, స్వామి ఫిర్యాదు చేశారు. గోదావరి ఏటిగట్టు బలహీనపడిందని, పొన్నపల్లి వద్ద పటిష్ఠపర్చాలని కోరారు.
పులసపై సీఎం ఆరా: సీఎం చంద్రబాబు నరసాపురం పర్యటనలో పులస చేపపై ఆరా తీశారు. బోటులో వెళుతున్నప్పుడు సీఎం బోటులో ఉన్న ప్రభుత్వ విప్ నాయకర్‌ను పులస గురిం చి అడిగారు. పులస చేప గోదావరిలోకి ఎక్కడ నుంచి వస్తుంది? ప్రస్తుతం పులస ఉత్పత్తి ఎందుకు తగ్గింది అంటూ నాయకర్‌ను ఆడిగారు. ‘గోదావరికి వరదొచ్చినప్పుడు గతంలో పులస చేపలు పుష్కలంగా దొరికేవి. అయితే నేడు అ పరిస్థితి లేదు. ఉత్పత్తి తగ్గింది’’ అని సీఎంకు ఆయన వివరించారు.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని