మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:01 AM
కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకాక్షించారు. మంగళవారం గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. గోనెగండ్లలో కాజా మున్నిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు
కర్నూలు కలె క్టర్ డాక్టర్ సిరి
కర్నూలు కలె క్టర్ డాక్టర్ సిరి
గోనెగండ్ల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకాక్షించారు. మంగళవారం గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. గోనెగండ్లలో కాజా మున్నిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పీఎంఈజీపీ పథకం కింద యూనిట్‌కు రూ. 10లక్షలు రుణం మంజూరైందని రూ. 3.50 లక్షలు వరకు సబ్సిడీ వస్తుందని నిర్వాహకులు కలెక్టర్‌కు తెలిపారు. పేపర్ రోల్ సేకరణ, ఏ-4 పేపర్ ఉత్పత్తి ప్రక్రియ నెలవారీ నిర్వహణ ఖర్చుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఖర్చులు సమగ్రంగా లె క్కించి లాభదాయకంగా అభివృద్ధి చేసుకోవాలని మార్కెట్‌ను విస్తరించుకోవాలని కోరారు. అనంతరం ఫాతిమా నిర్వహించే పిండిమర అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కారం మిల్లు యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. పథకం కింద రూ. 3.82 లక్షలు కాగా పీఎంఎ్‌ఫఎంఈ రుణం రూ. 1.82 లక్షలు, బ్యాంక్ రుణం రూ. 50వేలు సమకూర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే షహాజాది అనే మహిళ ఏర్పాటు చేసుకున్న శారీస్ సెంటర్ దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో అరుణాదేవి, డీఆర్‌డీవో పీడీ శ్రీధర్‌రావు, ఎంపీడీవో మణిమంజరి, డి ప్యూటీ ఎంపీడీవో అనంతశయన, శశిదేవి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీర పాల్గొన్నారు.