అసత్య ప్రచారాలను తిప్పి కొట్టండి: రవికుమార్
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:59 PM
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని క్యాడర్ తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని క్యాడర్ తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు మంగళ వారం దన్నానపేటలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రా ష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నాయకులు అన్నెపు భాస్కరరావు, గొర్రెల సూర్యం, తాడేల రాజారావు తదితరులు పాల్గొన్నారు.