Share News

ఎస్వీ జూకు త్వరలో 61 వన్యప్రాణుల రాక

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:47 PM

తిరుపతి ఎస్వీ జూపార్కుకు త్వరలో అరుదైన వన్యప్రాణులు రానున్నాయి. విశాఖ జూపార్కు, హైదరాబాదు జూపార్కు, చెన్నైలోని క్రొకోడైల్‌ బ్యాంకు ట్రస్టు, గుజరాత్‌ రాష్ట్రం జాంనగర్‌లోని గ్రీన్స్‌ జువాజికల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ నుంచి మొత్తం 61 వన్యప్రాణులు తిరుపతికి రానున్నాయి.

ఎస్వీ జూకు త్వరలో 61 వన్యప్రాణుల రాక

  • ఇతర జూపార్కులతో ఒప్పందాలు

తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్కుకు త్వరలో అరుదైన వన్యప్రాణులు రానున్నాయి. విశాఖ జూపార్కు, హైదరాబాదు జూపార్కు, చెన్నైలోని క్రొకోడైల్‌ బ్యాంకు ట్రస్టు, గుజరాత్‌ రాష్ట్రం జాంనగర్‌లోని గ్రీన్స్‌ జువాజికల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ నుంచి మొత్తం 61 వన్యప్రాణులు తిరుపతికి రానున్నాయి. పరస్పర వన్యప్రాణి మార్పిడి విధానం ద్వారా వీటిని తెప్పించనున్నట్లు అసిస్టెంట్‌ క్యూరేటర్‌ జగదీష్‌ చంద్రప్రసాద్‌ చెప్పారు. తిరుపతినుంచి గరియల్‌-2, ఇండినగ్‌ గౌడ్‌-2, జపనీస్‌ కోయల్‌ -4, మస్కోవి డెక్‌ -4, గే పిలికాన్‌ -2, వైటఖ్‌ ఈబీస్‌ 2 హైదరాబాద్(Hyderabad)లోని నెహ్రూ జులాజికల్‌ పార్కుకు పంపిస్తారు.


zzzzzzzzz.jpgఅక్కడినుంచి మగ్గర్‌ క్రోకోడైల్స్‌ -4, ఇండియన్‌ మౌస్‌ డీర్‌-6, రింగ్‌ నెక్కుడ్‌ పీసెంట్‌ -2, గోల్డెన్‌ పీసెంట్‌-2, సిల్వర్‌ పీసెంట్‌ -1, రెడ్‌ జంగిల్‌ ఫోవల్‌ -2, జంధ్యాకోనూరే 2 ఇక్కడికి రానున్నాయి. మద్రాస్‌ క్రొకోడైల్‌ బ్యాంకు ట్రస్టు నుంచి మొసళ్లు-5, ఉప్పునీటి మొసళ్లు 2, ఎల్లో అనకొండ-9 ఎస్వీ జూపార్కుకు రానున్నాయి. విశాఖలోని ఇందిరాగాంధీ జువాజికల్‌ పార్కు నుంచి ఒక తెల్లపుల్లి ఎస్వీ జూపార్కుకు రానుండగా ఇక్కడున్న తెల్లపులిని వారికి పంపిస్తారు. రెండు అడవికుక్కలు, ఒక తోడేలు, రెండు జింకలు, బూడిదరంగు అడవికోళ్లు రెండు విశాఖ జూకు పంపించనున్నారు.


zzzzzzzzzzz.jpgదానికి బదులుగా అక్కడి నుంచి ఒక తోడేలు, రెండు అడవికుక్కలు, రెండు అడవిపిల్లులు, రెండు నీల్‌గై, నాలుగు గ్రీన్‌ ఇగ్వనాలను తిరుపతి జూపార్కుకు అందజేయనున్నారు. జామ్‌నగర్‌కు తెల్లపులి ఒకటి, ఇండియన్‌ గౌర్‌ రెండు, బ్లాక్‌ బక్‌-10, సాంబార్‌-10, బార్కింగ్‌ డీర్‌-2, మస్క్వేడక్‌-2, జాగ్వర్‌ ఒకటి అందజేస్తారు. దీనికి బదులుగా జీబ్రాలు 4, బ్లాక్‌ పాంథర్‌ రెండు, జిరాఫీలు రెండు, జాగ్వార్లు రెండు, రెడ్‌ నెక్కుడు వాలాబీ నాలుగు తిరుపతి ఎస్వీ జూపార్కుకు అందజేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ..

భగ్గుమన్న పసిడి ధరలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 12:47 PM