భగ్గుమన్న పసిడి ధరలు!
ABN , Publish Date - Feb 28 , 2026 | 10:26 AM
శనివారం దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడి ధర రూ.3 వేల మేర పెరిగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుల అంచనాలకు అందని విధంగా మారుతున్నాయి. రెండు రోజుల పాటు దాదాపు స్థిరంగా కొనసాగిన ధరలు శనివారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో బంగారం ధర సగటున రూ.3 వేల మేర పెరగ్గా వెండి ధర కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఎగబాకింది (Gold, Silver Rates in India).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,64,730లకు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.3,160ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ పసిడి ధర కూడా రూ.2,900ల మేర పెరిగి రూ.1,51,000లకు చేరుకుంది. నగరంలో వెండి ధర కూడా రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.3 లక్షలుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా రూ.1,65,820కు చేరింది. ముంబై, కర్ణాటక, బెంగళూరు నగరాల్లో మేలిమి బంగారం ధర రూ.1,64,730గా ఉంది. ఢిల్లీలో రూ.1,64,880ల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర (10 గ్రాములు) చెన్నైలో రూ.1,52,000గా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,51,000 వద్ద కొనసాగుతోంది.
నగరాల వారీగా వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ప్రస్తుతం రూ.3 లక్షలకు చేరుకుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఈ వార్తలూ చదవండి:
ప్రగతి రథం.. వృద్ధి పథం.. భారత్ వృద్ధి రేటు 7.8 శాతం