Share News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..

ABN , Publish Date - Jun 08 , 2026 | 09:52 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..
Tirupati Alliance Meeting

తిరుపతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 9న తిరుపతిలో 'సంక్షేమం' పేరిట భారీ విజయోత్సవ సభను నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు.


ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా కూటమి నేతలంతా భారీగా హాజరుకావాల్సి ఉంది. అయితే, నేడు (సోమవారం) విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2 విభాగంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్‌ మెటల్‌ ల్యాడల్‌ నుంచి బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో ల్యాడల్‌లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడింది. ఈ ఘటనలో 8మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు తోటి కార్మికులు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా కూటమి పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో విజయోత్సవ సభ పెట్టడం సరికాదని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం.. అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పవన్, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

Updated Date - Jun 08 , 2026 | 10:01 PM