Share News

డీఎస్సీ నిర్వహించకూడదని ఎన్నో అడ్డంకులు సృష్టించిన వైసీపీ: శాప్ చైర్మన్

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:42 PM

మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు అభివర్ణించారు.

డీఎస్సీ నిర్వహించకూడదని ఎన్నో అడ్డంకులు సృష్టించిన వైసీపీ: శాప్ చైర్మన్
SAAP Chairman Ravi Naidu

తిరుపతి, జూన్11: మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు అభివర్ణించారు. ఈ మెగా డీఎస్సీ నిర్వహించకూడదని ఎన్నో అడ్డంకులు సృష్టించారని వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ పోస్టుల భర్తీపై జూన్ 13వ తేదీన తిరుపతి వేదికగా ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.


గ్రూప్-1, గ్రూప్-2 అంటే ఏమిటో కూడా వైఎస్ జగన్‌కు తెలియదని రవి నాయుడు వ్యంగ్యంగా అన్నారు. మెగా డీఎస్సీ నియామకం పారదర్శకంగా, సక్రమంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ పరీక్ష నిర్వహణ నుంచి నియామకాల వరకూ ఎక్కడా ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో ఉద్యోగం రాని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.


నిరుద్యోగులారా ఆలోచించండి.. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మకండంటూ వారికి శాప్ చైర్మన్ హితవు పలికారు. స్పోర్ట్స్ కోటాలో కూడా సక్రమ పద్ధతిలో డీఎస్సీ నియామకం జరిగిందన్నారు. కొంతమందిని పక్కన పెట్టుకుని.. పనిగట్టుకుని వారితో నాటకాలాడిస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు ఎండగట్టారు. అధికారంలోకి రాగానే మెుదటి సంతకం మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఎందుకు పనికిరాని డీఎస్సీ తీసుకొచ్చారని శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉపాధ్యాయ నియామకాల్లో గొడ్డలి రాజకీయాలు చేస్తున్న జగన్ : టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

పనిచేయని సీఎంకు ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు?: హరీశ్ రావు

For More AP News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 06:53 PM