Share News

నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు.. రెండు రోజులు బిజీబిజీగా పర్యటన..

ABN , Publish Date - Sep 21 , 2026 | 07:39 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు.. రెండు రోజులు బిజీబిజీగా పర్యటన..
AP CM Chandrababu Naidu

చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10:30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిసికి సీఎం చేరుకుంటారు.


ఉదయం 10:30 నుంచి 10:45 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లెలో రైతు బజార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే ప్రజా బహిరంగ సభలో పాల్గొని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత తన నివాసానికి చేరుకుని ఆదిత్య బిర్లా గ్రూప్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు, జిల్లా అటవీ శాఖ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.


అలాగే, మంగళవారం కూడా సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. ఆ రోజు ఉదయం 9:45 గంటలకు కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చేరుకుని హంద్రీ-నీవా కాలువ వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, 12:30 గంటలకు జలహారతి కార్యక్రమాన్ని ముగించుకుని హెచ్ఏఎం ప్రాజెక్టులు, ఈసీ పౌల్ట్రీ షెడ్లను ప్రారంభించనున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4:40 గంటలకు తుమ్మిసి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా తిరుగు ప్రయాణం అవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్‌

శ్రీవారి సేవలో ప్రముఖులు

Updated Date - Sep 21 , 2026 | 07:42 AM