శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:23 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌రెడ్డి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.
తిరుమల, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌రెడ్డి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అలాగే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ము రుగన్.. హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.