మహానాడు విజయవంతం.. నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - May 30 , 2026 | 03:35 PM
టీడీపీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు విజయవంతంగా జరగడంపై నేతలు, కార్యకర్తలను సీఎం అభినందించారు..
అమరావతి, మే 30: హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయంపై టీడీపీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో మహానాడు కార్యక్రమం నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. మహానాడును సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు చేసిన కొన్ని వ్యాఖ్యలు సరికావు. ఎంతో చరిత్ర, నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగుజాతి ఒక్కటే.. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై, తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్దికి బాటలు పడ్డాయి. తెలంగాణలో ఉత్సాహంగా మహానాడు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మహానాడులో ఆమోదించిన 33% మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..