Share News

వెలిగొండతో జలం, జీవం, జీవితం

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:42 AM

వెలిగొండ ద్వారా విడుదలైన కృష్ణా జలాలు మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నాయి. మార్కాపురం జిల్లాలో నల్లమల కొండల్లో తొలిచిన సొరంగాలు దాటుకుని ఫీడర్‌ కాలువ ద్వారా నల్లమల సాగర్‌కు నీరు చేరుతోంది.

వెలిగొండతో జలం, జీవం, జీవితం

  • ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్టు

అమరావతి, మార్కాపురం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ద్వారా విడుదలైన కృష్ణా జలాలు మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నాయి. మార్కాపురం జిల్లాలో నల్లమల కొండల్లో తొలిచిన సొరంగాలు దాటుకుని ఫీడర్‌ కాలువ ద్వారా నల్లమల సాగర్‌కు నీరు చేరుతోంది. ఈక్రమంలో ఫీడర్‌ కాలువ పొడవునా మూగజీవాలు దప్పిక తీర్చుకుంటూ సేద తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ‘వెలిగొండతో జలం... జీవం... జీవితం’ అంటూ మంగళవారం కోతులు దాహం తీర్చుకుంటున్న వీడియోను సీఎం చంద్రబాబు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. మరో పోస్టులో వెలిగొండ ప్రాజెక్టు విజువల్స్‌కు... ‘30 ఏళ్ల కల నెరవేరిన చోటు’ అన్న క్యాప్షన్‌ను సీఎం జత చేశారు.

వ్యవసాయ, వైద్య రంగంలో ఏఐ

‘వ్యవసాయం, వైద్య రంగాల్లో ఏఐ టెక్నాలజీని అమలు చేస్తున్నాం. వ్యవసాయ అధికారుల పనిని ఏఐ ద్వారా పరిశీలిస్తాను. ఎవరైనా పనిలో వెనకబడితే గుర్తిస్తా. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. వాటికనుగుణంగా మన పంటలు ఉండాలి. ఆక్వా రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంలో యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 పైసలకే అందిస్తున్నాం. ఏటా ఆక్వా రైతుల కోసం 1,200 కోట్లు వెచ్చిస్తున్నాం. 3 సార్లు గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం సీఎంగా తనకు అదృష్టంగా భావిస్తానని సీఎం అన్నారు. ‘‘పుష్కరాలు అద్బుతంగా నిర్వహించాలి. నరసాపురంలో పుష్కరాలు వైభవంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మొగల్తూరులో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచుకుని, సమష్టి కృషితో నరసాపురంలో విజయాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు.


ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 03:42 AM