ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:56 AM
శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. గరివిడిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ...
చిన్న శ్రీనుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నేతలు
భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి
గరివిడి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. గరివిడిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు గత 25 సంవత్సరాలుగా చిన్న శ్రీనుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండేవారని, శ్రీను పార్టీని ఎందుకు వీడారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బొత్స తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీంటి పర్యంతమయ్యారు. దీంతో అక్కడ మొత్తం నిశ్శబ్దంగా మారింది. పక్కనే ఉన్న కుమార్తె అనూష, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ బొత్సను ఓదార్చారు. కాసేపటికి తేరుకున్న ఆయన... ‘చిన్న శ్రీను వ్యవహార శైలిపై నాకు 8 నెలల ముందే అనుమానం వచ్చింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న ఉద్దేశంతో నా అనుమానాన్ని బహిర్గతం చేయలేదు. ఇలాంటి ఒడిదుడుకులు నాకు కొత్తకాదు. అందరికీ అందుబాటులో ఉంటా. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి’ అని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెగిన రోప్.. దిగిపోయిన 9వ గేటు
ఒక్కరోజే 6.93 కోట్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News