Share News

రెయిన్ అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

రెయిన్ అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు
Andhra Pradesh Rain Alert

విశాఖపట్నం, జులై 1: ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జులై 3న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి...

బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు

బైక్ దొంగతనాల ముఠా అరెస్ట్.. 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 05:52 PM