Share News

ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ వేళ ఈ రైళ్ల రద్దు

ABN , Publish Date - Oct 26 , 2026 | 10:06 PM

అర్నబ్ తుఫాన్ వేళ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు జోన్ అధికారులు ఆ రైళ్ల వివరాలను వెల్లడించారు.

ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ వేళ ఈ రైళ్ల రద్దు

విశాఖపట్నం, అక్టోబర్ 16: అర్నబ్ తుఫాన్ వేళ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు జోన్ అధికారులు ఆ రైళ్ల వివరాలను వెల్లడించారు. రేపు (మంగళవారం) ప్రయాణించే.. విజయవాడ - రాజమండ్రి (67202), విజయవాడ-నరసాపురం (67257), విజయవాడ- మచిలీపట్నం (67267), నరసాపురం- గుంటూరు (67247), రాజమండ్రి- కాకినాడ పోర్ట్‌ (67301), రాజమండ్రి- విశాఖ (67285/67286), విజయవాడ-నరసాపురం (67258), నరసాపురం- విజయవాడ (67276), నరసాపురం- రాజమండ్రి (67246), విజయవాడ- నరసాపురం (17269), నరసాపురం- భీమవరం (17264), విజయవాడ-కాకినాడ పోర్ట్‌ (17257) రైళ్లను రద్దు చేశామని రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు.


అలాగే ఎల్లుండి (బుధవారం) ప్రయాణించే.. నరసాపురం- నిడదవోలు (67244/67245), నరసాపురం - విజయవాడ (17270), గుంటూరు- రేపల్లె (67249/67223), రేపల్లె - గుంటూరు/తెనాలి (67250/67224), విజయవాడ -రాజమండ్రి (67262), గుంటూరు/తెనాలి -విజయవాడ (67248/67222), విజయవాడ- గుంటూరు (67229), భీమవరం- మచిలీపట్నం (67251),విజయవాడ-మచిలీపట్నం (67266/67268/67269/67270), విజయవాడ -భీమవరం (67275/67281), భీమవరం- నిడదవోలు (67277/67283), నిడదవోలు -భీమవరం (67278/67284), భీమవరం- విజయవాడ(67282), కాకినాడ పోర్ట్‌- రాజమండ్రి (67302), కాకినాడ- విజయవాడ (17258) రైళ్లు రద్దయ్యాయి.


రేపు, ఎల్లుండి (మంగళ, బుధవారాలు) రెండు రోజుల పాటు మరికొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. అందులో కాకినాడ పోర్ట్‌ -విశాఖ (17267/17268), పార్వతీపురం -విశాఖ (07267/07268), రాజమహేంద్రవరం- విజయవాడ (67261), విజయవాడ- మచిలీపట్నం (67263/67265), మచిలీపట్నం- విజయవాడ (67264/67256), మచిలీపట్నం- గుడివాడ (67271/67252/67254), గుడివాడ-మచిలీపట్నం (67272/67253/67255) రైళ్లు ఉన్నాయి.


ఇవీ చదవండి

అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు

ఏపీ స్థానిక ఎన్నికల్లో ప్రచార ఖర్చులపై ఈసీ కీలక మార్గదర్శకాలు

Updated Date - Oct 26 , 2026 | 10:17 PM