APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్..
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:19 AM
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. అద్దె పెంచాలంటూ అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టాలు వస్తోన్న దృష్ట్యా తమకు చెల్లించే అద్దె పెంచాలంటున్నారు.
అమరావతి, జనవరి 8: ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. అద్దె పెంచాలంటూ అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టాలు వస్తోన్న దృష్ట్యా తమకు చెల్లించే అద్దె పెంచాలంటున్నారు. అద్దె పెంచకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై గురువారం నాడు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానుల సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
స్త్రీశక్తి పథకం అమలుతో అధిక రద్దీ వల్ల తమపై అదనపు భారం పడుతోందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. ఇందన ఖర్చు పెరగడం, నిర్వహణ ఖర్చు సైతం పెరగడంతో ఇబ్బంది అవుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అద్దె పెంచాలని గత కొంతకాలంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని అభ్యర్థిస్తున్నారు. వీరి అభ్యర్థనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. నెలకు అదనంగా రూ. 5,200 ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, స్వల్పంగా పెంచిన ఈ అద్దెపై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ.. సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read:
మేడ్చల్‌లో దారుణం.. ఓ వ్యక్తిపై దాడి..
సంక్రాంతికి 9 నుంచి ప్రత్యేక బస్సులు
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..