Share News

244 పోస్టులతో 3 నోటిఫికేషన్లు

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:11 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. సోమవారం అర్థరాత్రి మూడు నోటిఫికేషన్లు జారీచేసింది.

244 పోస్టులతో 3 నోటిఫికేషన్లు

  • వీటిలో 166 గ్రూప్‌-1 ఉద్యోగాలు.. పీసీబీ ఏఈఈ 41, హార్టికల్చర్‌ 37

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. సోమవారం అర్థరాత్రి మూడు నోటిఫికేషన్లు జారీచేసింది. అందులో గ్రూప్‌-1 ఉద్యోగాలు 166, కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పోస్టులు 41, ఉద్యాన అధికారుల పోస్టులు 37 ఉన్నాయి. మొత్తం 244 ఉద్యోగాలతో ఈ 3నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో... డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 12, స్టేట్‌ ట్యాక్స్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌ 14, డీఎస్పీ 36, డీఎస్పీ(కమ్యూనికేషన్స్‌) 3, జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) 14, ప్రాంతీయ రవాణా అధికారి 3, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి 1, కో-ఆపరేటివ్‌ సర్వీస్‌లో డిప్యూటీ రిజిస్ర్టార్‌ 16, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ 12, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 2, జిల్లా ఉపాధి కల్పన అధికారి 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 15, పంచాయతీరాజ్‌లో డివిజినల్‌ డెవల్‌పమెంట్‌ అధికారి 35 పోస్టులు ఉన్నాయి. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మొదటిసారి డీఈవో పోస్టులను గ్రూప్‌-1లో చేర్చారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జనవరి 24న జరుగుతుంది.

పీజీ అడ్మిషన్లకు రెండో విడత కౌన్సెలింగ్‌

పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఉన్నత విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి 11 వరకు విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 12 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్లను పెట్టుకునే అవకాశం ఉంది. 17న సీట్లు కేటాయిస్తారు. 21 నుంచి 24 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలి.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:11 AM