Share News

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:43 AM

జర్నలిజం రంగంలో ప్రతిభావంతులకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

28లోగా దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): జర్నలిజం రంగంలో ప్రతిభావంతులకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 28లోగా ‘డైరెక్టర్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ, 2వ అంతస్తు, ఎన్టీఆర్‌ పరిపాలన భవనం, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌, విజయవాడ-520013’ అనే చిరునామాకు పంపాలని ఆయన కోరారు. ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధన పూర్తి సమాచారాన్ని సమాచార, పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్‌ వెబ్‌సైట్‌ https://mediarelations.ap.gov.in/mediaలో పరిశీలించవచ్చని ఆయన సూచించారు.

ఈ వార్తలను కూడా చదవండి

సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

రెండుగా జడ్పీ

Updated Date - Sep 06 , 2026 | 05:43 AM