సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:39 PM
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ సిరి
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహరాన్ని అం దించాలని ఆదేశించారు. పిల్లల హాజరు, భోజన నాణ్యత, మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. పోషణ్ ట్రాకర్‌లో చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సు వివరాలను నిర్ణీత గడువు లోపు వంద శాతం కచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. బాల్య వివాహాల నివారణకు అంగన్ వాడీ సిబ్బంది ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ పి.విజయ, సీడీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు